'కొరియర్ బాయ్ కల్యాణ్ ' రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Monday,September 07 2015]

గురు ఫిలిమ్స్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ సమర్పణలో యంగ్ హీరో నితిన్, యామీ గౌతమ్ జంటగా రూపొందిన సినిమా కొరియర్ బాయ్ కల్యాణ్'. ప్రేమ్ సాయి దర్శకుడు. కార్తీక్, అనూప్ లు ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. నిజానికి ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసినా సెన్సార్ కార్యక్రమాలు అనుకున్న తేదీలో జరగకపోయే అవకాశం ఉండటంతో సినిమాని సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారట. అధికారకంగా విడుదల తేది ప్రకటించాల్సి ఉంది.