16 ఏళ్ళు పూర్తిచేసుకున్న నితిన్‌

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

యువ‌త‌రంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ‌ క‌థానాయ‌కుల్లో నితిన్ ఒక‌రు. ప్రేమ‌క‌థా చిత్రాల‌ల్లోనే ఎక్కువ‌గా రాణించిన నితిన్‌.. ఇటీవ‌లే ఛ‌ల్ మోహ‌న్ రంగ‌తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. అలాంటి నితిన్‌ తొలి అడుగులు ప‌డింది 'జ‌యం' చిత్రంతో. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ రూపొందించిన ఈ చిత్రంలో నితిన్ ప‌క్కింటి కుర్రాడు త‌ర‌హా పాత్ర‌లో ఒదిగిపోయారు.

స‌దా క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ మూవీ విడుద‌లై నేటిగ్గా స‌రిగ్గా ప‌ద‌హారేళ్ళు. అంటే.. క‌థానాయ‌కుడిగా నితిన్ ప్ర‌యాణం మొద‌లై నేటితో 16 ఏళ్ళు పూర్త‌వుతోంద‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం నితిన్.. శ‌త‌మానం భ‌వ‌తి ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌నివాస క‌ళ్యాణం చేస్తున్నారు. కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.