సమంత పెళ్ళి గురించి నితిన్ కామెంట్..
- IndiaGlitz, [Friday,May 27 2016]
ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని...అనతి కాలంలోనే స్టార్ట్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇదిలా ఉంటే...ఇటీవల ఓ ప్రముఖ తెలుగు దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో సమంత ...టాలీవుడ్ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నాను. త్వరలోనే పెళ్లి కబురు చెబుతాను. మా పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు అని చెప్పింది. సమంత ఇలా చెప్పిందో లేదో....సమంత ఎవర్ని మాయ చేసింది..ఎవరా యంగ్ హీరో అంటూ ఎక్కడ చూసినా ఇదే టాపిక్ గురించి డిష్కషన్స్.
అయితే...ఈరోజు అ ఆ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నితిన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ సమంత ఓ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నాను. త్వరలో పెళ్లి గురించి ఎనౌన్స్ చేస్తాను అని చెప్పింది. ఎవరా హీరో అని నితిన్ ని అడిగితే...నాకు సమంత ఆ విషయం చెప్పలేదు అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు. సమంత చెప్పక పోయినా మీకు తెలుస్తుంది కదా...అని మీడియా అంటే..నితిన్ ఇంకా తెలివిగా ఆ హీరో ఎవరో మీకు తెలుసుకదా...అందరూ అనుకుంటున్న హీరోనే అని చెప్పకనే చెప్పేసాడు. నితిన్...ఇలా చెప్పడంతో ఇక ఆ యంగ్ హీరో ఎవరో క్లారిటీ వచ్చేసింది. అయితే...ఆ యంగ్ హీరో అభిమానులు మాత్రం ఈ విషయం తెలిసి ఇది నిజమా..నమ్మలేకపోతున్నాం అంటున్నారు. మరి...చివరికి ఏం జరుగుతోందో చూడాలి.