నితిన్‌కు మంచి సినిమానే పడింది...
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ దర్శకత్వంలో చినబాబు నిర్మించిన చిత్రం 'అఆ'. జూన్ 2న విడుదలైన చిత్రం నితిన్ కెరీర్లో బెస్ట్ చిత్రంగా నిలిచిపోయేలా ముందుకు సాగిపోతుందట. తొలిరోజునే ఐదున్నర కోట్ల రూపాయల షేర్‌ను కలెక్ట్ చేసి నితిన్ మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచిన చిత్రంగా నిలిచింది. నితిన్ స్టారడమ్కు త్రివిక్రమ్ డైరెక్షన్ పవర్ యాడ్ కావడంతోనే సినిమా కలెక్షన్స్ బాగా రాబోతుందని ట్రేడ్ వర్గాల సమాచారం.
బాక్సాఫీస్ లెక్కలు చూసుకుంటే షేర్ కలెక్షన్స్ బట్టి చూసి టాప్ మూవీ లిస్టులో అఆ చేరిందని బిజినెస్ వర్గాలు అంటున్నాయి. సినిమా శాటిలైట్ రేటు విషయంలో ఆరుకోట్లను చెల్లించి జీటీవీవారు హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. నా కెరీర్లో మంచి సినిమా పడాలని అనుకుంటున్న తరుణంలో అఆ సినిమా వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితిన్ తెలియజేశాడు. ఇప్పుడు కలెక్షన్స్‌ను బట్టి నితిన్ నమ్మకం నిజమైనట్టు కనపడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments