నితిన్ మూవీ రిలీజ్ డేట్ మారిందా...?
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు. వెరైటీగా ఉన్న అ ఆ టైటిల్ కి అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ట్యాగ్ లైన్.
నితిన్ సరసన సమంత, ప్రేమమ్ ఫేం అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. కొలవెరీ ఢీ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుథ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 16న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రేమికుల రోజు అనగా ఫిబ్రవరి 14న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com