వేసవి కానుకగా నితిన్ 25
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటించిన 25వ సినిమాని రౌడీ ఫెలో` దర్శకుడు కృష్ణచైతన్య తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హోం బ్యానర్ పికె క్రియటివ్ వర్క్స్, నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అమెరికాలోనే దాదాపుగా చిత్రీకరణని జరుపుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథని అందించారు. ఇదిలా వుంటే...ఈ సినిమాకి సంబంధించి ఒక పాట, మరికొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని ఇటీవలే నితిన్ చెప్పుకొచ్చాడు.
త్వరలోనే వీటిని పూర్తిచేసుకుని.. తదుపరి నిర్మాణానంతర పనులు చేపట్టాలని యూనిట్ భావిస్తోంది. లై` చిత్రంతో డీలా పడ్డ నితిన్ ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అలాగే లై` ఫేం మేఘా ఆకాష్ మరోసారి నితిన్ సరసన నాయికగా నటిస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయబోతున్నట్లు...అలాగే వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com