వేసవి కానుకగా నితిన్ 25

  • IndiaGlitz, [Monday,January 29 2018]

యువ కథానాయకుడు నితిన్ హీరోగా న‌టించిన‌ 25వ సినిమాని రౌడీ ఫెలో' దర్శకుడు కృష్ణచైతన్య తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హోం బ్యానర్ పికె క్రియటివ్ వర్క్స్, నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అమెరికాలోనే దాదాపుగా చిత్రీకరణని జరుపుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన‌ర్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథని అందించారు. ఇదిలా వుంటే...ఈ సినిమాకి సంబంధించి ఒక పాట, మరికొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని ఇటీవ‌లే నితిన్ చెప్పుకొచ్చాడు.

త్వ‌ర‌లోనే వీటిని పూర్తిచేసుకుని.. తదుపరి నిర్మాణానంతర పనులు చేపట్టాలని యూనిట్ భావిస్తోంది. లై' చిత్రంతో డీలా పడ్డ నితిన్ ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అలాగే లై' ఫేం మేఘా ఆకాష్ మరోసారి నితిన్ సరసన నాయికగా నటిస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, టైటిల్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు...అలాగే వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

More News

భాగమతి చిత్రాన్ని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు - అనుష్క

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం సూపర్ హిట్ టాక్ తో...

సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నిన్నే చూస్తు

వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్ మరియు హేమలత(బుజ్జి) హీరో హీరోయిన్ గా

ప్రేమికుల రోజు కానుక‌గా 'రంగ‌స్థ‌లం' తొలి పాట‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌స్తుతం 'రంగస్థలం' చిత్రంలో క‌థానాయ‌కుడిగా నటిస్తున్న‌ విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌గా సాగే ఈ గ్రామీణ నేపథ్యపు చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌ నిర్మిస్తోంది.

కాజ‌ల్‌.. చిన‌నాటి క‌ల‌

గ‌తేడాది.. కాజ‌ల్ అగ‌ర్వాల్  కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. చిరంజీవి రీ-ఎంట్రీ ఫిలిం 'ఖైదీ నంబర్ 150'లో కథానాయికగా సంద‌డి చేసిన కాజ‌ల్‌...ఎప్పటినుంచో విజయం కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా సరసన 'నేనే రాజు నేనే మంత్రి'లో హీరోయిన్‌గా నటించింది.

ర‌వితేజ‌ని టీజ్ చేసిన ముద్దుగుమ్మ‌

'రన్ రాజా రన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక సీరత్ కపూర్. గ‌తేడాది నాగార్జున, స‌మంత న‌టించిన‌ 'రాజుగారి గది2'లో ఓ కీల‌క పాత్ర‌లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఒక్క క్షణం'లో కూడా న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో మెరిసింది సీర‌త్‌.