నితిన్ - పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,February 05 2018]

'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు.హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ ఈ చిత్రం.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ' ఈ నెల 12న చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నామని తెలిపారు. అలాగే చిత్రం టీజర్ ను ప్రేమికులరోజు అయిన ఈ నెల 14న, చిత్రం ను ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ' ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్. సంగీతం: థమన్.ఎస్.ఎస్.,కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, , కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి నిర్మాత: ఎం.సుధాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య

More News

నరేష్ , సునీల్ హీరోయిన్ గా...!

త్వరత్వరగా యాభై సినిమాలను పూర్తి చేయడమే కాకుండా ఈ తరం కథానాయకుల్లో మంచి కామెడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.

తేజు... అన్నయ్య చిరంజీవి, పవన్ కల్యాణ్ అంతా పెద్ద స్టార్ కావాలి - వి.వి.వినాయక్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో

ఇది నా లవ్ స్టోరీ కి యు/ఎ సర్టిఫికెట్

లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ 'ఇది నా లవ్ స్టోరీ'.

తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన 'మా' టీమ్

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని.

అప్పుడు గురువు.. ఇప్పుడు శిష్యుడు

ఒకే సంగీత దర్శకుడు సంగీతమందించిన మూడు చిత్రాలు ఒకే వారంలో సందడి చేయడమనేది అరుదుగా జరుగుతుంది.