బుల్లెట్ రాణి నాకొక బిగ్ ఛాలెంజ్ : నిషా కొఠారి

  • IndiaGlitz, [Monday,March 14 2016]

ఇప్పటివరకు తాను చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలో "బుల్లెట్ రాణి" లో చేసిన ఇన్స్ పెక్టర్ రాణి పాత్ర తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఈ క్యారెక్టర్ ను ఓ ఛాలెంజ్ గా తీసుకొని చేసానని "బుల్లెట్ రాణి" కథానాయకి నిషా కొఠారి పేర్కొంది. నిషా కొఠారి టైటిల్ పాత్రలో.. ఫోకస్ ఆన్ పిక్చర్స్ పతాకంపై సాజిద్ ఖురేషి దర్సకత్వంలో ఎం.ఎస్.యూసుఫ్ తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో నిర్మించిన "బుల్లెట్ రాణి" మార్చ్ 10 న కన్నడలో, మార్చ్ 11న తెలుగులో విడుదలై విజయవంతంగా ప్రదర్సితమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకి నిషా కొఠారి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. చిత్ర దర్శకులు సాజిద్ ఖురేషి తన పాత్రను ఎంతో ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారని, తన పాత్రకు వస్తున్న ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయని నిషా పేర్కొంది. ఆశిష్ విద్యార్ధి, రవి కాలే వంటి ప్రతిభావంతులతో కలిసి నటించడం తనకు చాలా సంతోషాన్ని, ఎంతో అనుభవాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. తెలుగులో తను నటించిన "క్రిమినల్స్" చిత్రం త్వరలో విడుదల కానుందని, ప్రస్తుతం తాను హిందీ లో రెండు, కన్నడలో ఒక సినిమా చేస్తున్నానని, తెలుగులోనూ మరో చిత్రానికి సంతకం చేయనున్నానని నిషా కొఠారి చెప్పింది!!

More News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా ప్రేమికుడు ఆడియో రిలీజ్..

మానస్.ఎన్,సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రేమికుడు.

అల్లరి నరేష్ చేతుల మీదుగా రన్ ఆడియో రిలీజ్...

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్.ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి,కిషోర్ గరికపాటి,అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

గోపీచంద్ వద్దన్నాడు..బన్ని చేస్తున్నాడు

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు సరైనోడు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. బొలివియాలో షూటింగ్ కూడా ముగిసింది. సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స‌ర్ధార్ త‌ర్వాత ఇక రెండు లేక మూడు సినిమాలు చేస్తాను అంతే... - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ....ఈ పేరులో ఎంత ప‌వ‌ర్ ఉందో...ఈ పేరుకి ఎంత క్రేజ్ ఎందో అంద‌రికీ తెలిసిందే. కానీ...ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇదంతా మాయ‌...ఆ దేవుడి ద‌య‌..అంటూ అధ్యాత్మికంగా మాట్లాడుతుంటారు.

మహిళల భద్రతపై చరణ్ కేర్

తెలంగాణ పోలీసులు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మహిళ రక్షణ జాగ్రత్తలు గురించి అవేర్ నెస్ ను క్రియేట్ చేయడానికి సంకల్పించారు. అందులో భాగంగా దాదాపు రెండు వేల మంది అమ్మాయిలు, మహిళలకు  రక్షణకు సంబంధించిన ప్రోగ్రాం నిర్వహిస్తారట.