ఫ్యామిలీ అంతా కలసి చూసేలా ఉండే సరికొత్త హర్రర్ తులసీదళం - హీరో నిశ్చల్
- IndiaGlitz, [Friday,March 11 2016]
కలర్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఆర్.పి.పట్నాయక్ తెరకెక్కించిన తాజా చిత్రం తులసీదళం. నిశ్చల్ దేవ్, వందన గుప్త, బ్రహ్మానందం, ఆర్.పి.పట్నాయక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన తులసీదళం చిత్రాన్ని ఈ నెల 11న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా తులసీదళం హీరో నిశ్చల్ ఇంటర్ వ్యూ మీకోసం...
ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?
ఈ సినిమా ప్రారంభానికి నాలుగు నెలల ముందు ఆర్పీ గారు ఈ కథ చెప్పారు. కథ విన్నవెంటనే నేను చాలా హ్యాఫీగా ఫీలయ్యాను. ఎందుకంటే ఒకటి కథ నచ్చడం...రెండోది లాస్ వేగాస్ నాకు బాగా ఇష్టం. ఈ సినిమా షూటింగ్ అంతా లాస్ వేగాస్లో ఉండడం. సో...వెంటనే ఆర్పీ గార్కి ఓకే చెప్పాను. ఫైనల్ గా తులసీదళం అవుట్ పుట్ చూసాను చాలా బాగా వచ్చింది. సో...చాలా హ్యాఫీగా ఉంది.
ఇది హర్రర్ మూవీ. డే టైమ్ లో హర్రర్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేసారు..?
అసలు ఈ సినిమా కాన్సెప్టే అదండి. వరల్డ్ లో బ్రైటెస్ట్ సిటీ ఏదైనా ఉందంటే..అది లాస్ వేగాసే. అలాంటి బ్రైట్ సిటీలో హర్రర్ సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పుడు చెప్పడం కంటే స్ర్కీన్ పై చూస్తేనే బాగుంటుంది. ఇది ఒక లవ్ స్టోరి. అయితే హర్రర్ మూవీస్ ని ఫ్యామిలీస్ అంతా కలసి చూడలేరు. కానీ..మా సినిమాని ఫ్యామిలీ అంతా కలసి చూడచ్చు.
నిశ్చల్ - వందన నిజంగానే లవర్స్ అనేంతగా నటించారని ఆర్పీ గారు చెప్పారు..మీరేమంటారు..?
ఆర్పీ గారు, కెమెరామెన్ శరత్ , నటుడు దువ్వాసి మోహన్ వీళ్లందరూ ముందు నుంచి నాకు బాగా తెలుసు. వందన గుప్తా సిస్టర్ ఇంతకు ముందు ఆర్పీ గారి సినిమాలో నటించింది. అప్పటి నుంచి వందన తో పరిచయం ఉంది. అలా పరిచయం ఉండడం వలన మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందని నా ఫీలింగ్.
ఆర్పీ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్...?
ఆర్పీ గారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఏం తీయాలనుకుంటున్నారో...ఆ సీన్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఫుల్ క్లారిటీతో ఉంటారు. అలాగే ఆయన సెట్ లో అరవడాలు..చిరాకుపడడం కానీ ఉండదు..చాలా కూల్ గా ఉంటారు. దాని వలన మేము బాగా నటించడానికి అవకాశం లభించినట్టు అనిపించింది. ఈ సినిమాలో ఆర్పీ గారితో..బ్రహ్మానందంగారితో వర్క్ చేయడం అనేది మరచిపోలేని అనుభూతి.
తులసీదళం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా విదేశాల్లో కూడా రిలీజ్ అవుతుందా..?
అవునండీ..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరు, చెన్నై, నార్త్ , అలాగే యు.ఎస్, యు.కె, ఆస్ట్రేలియాలో కూడా రిలీజ్ అవుతుంది.
ఫైనల్ గా ఈ సినిమా గురించి ఏం చెబుతారు..?
ఈ సినిమా ఒక కొత్త రకమైన ప్రయోగం. కామెడీ, లవ్, ఫ్యామిలీ డ్రామా, ఫ్రెండ్ షిప్...ఇలా హర్రర్ ఫిల్మ్ లో ఇన్ని జోనర్ ఉండడం అరుదు. ఇవన్నీఈ సినిమాకి ప్లస్ అవుతాయి అనుకుంటున్నాను.