'రాజరథం' లో నిరూప్ అవంతికల రొమాంటిక్ చలి పోరాటం
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల విడుదలైన 'రాజరథం' లోని రెండు పాటలు 'కాలేజ్ డేస్', 'నీలి మేఘమా' ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకున్నాయి. దర్శకుడు అనూప్ సంగీతం తో, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం తో రూపొందిన ఈ పాటలు కనువిందైన దృశ్యాలతో వీక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. కలర్ ఫుల్ విజువల్స్ తో అందంగా తెరకెక్కిన ఈ పాటల చిత్రీకరణ వెనక ఆసక్తికర విశేషాలున్నాయి. ఎన్నో జ్ఞ్యాపకాలని గుర్తు చేసేలా, కలల్లో విహరింపచేసే లా ఉన్న పాటలు వాస్తవానికి అందులో నటించిన నిరూప్ అవంతిక ల ను వణికించాయి.
ఆ పాటల చిత్రీకరణలో రెయిన్ సీక్వెన్స్ కోసం వాడిన నీరు చాలా చల్లగా ఉండడమే అందుకు కారణం. వణికించేంత చల్లని నీటిలో తడుస్తూ పాటకి తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. 'కట్' చెప్పగానే చిత్ర బృందం నిరూప్, అవంతిక ల మీద వేడి నీళ్ళు పోసి, బ్లాంకెట్ కప్పాక కానీ మాములు స్థితి కి వచ్చేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పెర్ఫెక్షనిస్ట్ గా పేరున్న దర్శకుడు అనూప్ తానూ అనుకున్న 'పర్ఫెక్ట్ షాట్' అనుకున్నట్లు వచ్చే వరకు రీటేక్ ల కి పిలిచేవారు. షూటింగ్ అయిపోయాక నిరూప్, అవంతిక లు చలి దెబ్బకి హీటర్ల ముందు ఒక అరగంట కూర్చుంటే కానీ వణుకు తగ్గేది కాదు. తర్వాతి రోజున షూటింగ్ కి ఇబ్బంది రాకూడదని జ్వరం తోనే షూట్ చేశారు. సినిమా చిత్రీకరణ ఎంతో కష్టం, శ్రమ తో కూడుకున్నది.
ఇంత శ్రమ పడి చేశారు కాబట్టే 'రాజరథం' ట్రైలర్, పాటలు అంత అద్భుతంగా రాగలిగాయి. ప్రేక్షకులని ఇంతలా ఆకట్టుకోగలిగాయి. తమ మొదటి ప్రయత్నంలో నే ఉత్తమ నిర్మాణ విలువలతో మంచి సినిమా ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న 'రాజా రథం' టీం ని అభినందించాల్సిందే. అజయ్ రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్ శాస్త్రి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న 'రాజరథం' ఫిబ్రవరి 16 నుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com