నిర్మలా కాన్వెంట్ ట్రైలర్ వచ్చేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం నిర్మలా కాన్వెంట్. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్‌గా నటించింది.
ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసారు. ఈ క్యారెక్టర్ ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. రిలీజ్ కి రెడీ అవుతున్న నిర్మలా కాన్వెంట్ డిజిటల్ ట్రైలర్ ను నాగార్జున ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా నాగ్ ట్విట్టర్ లో స్పందిస్తూ... ఫ్రెష్ ఫ్యూర్ లవ్ స్టోరీ గా నిర్మలా కాన్వెంట్ రూపొందింది. నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా రోషన్ ని పరిచయం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఐ లవ్ లవ్ స్టోరీస్ అని తెలియచేసారు. ఫ్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కిన నిర్మలా కాన్వెంట్ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com