ఆశలు ఆవిరి.. నిర్భయ నిందితులకు రేపే ఉరి..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతి భయంకరమైన నిర్భయ కేసులో ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారైపోయింది. ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ అవ్వగా.. దోషులు సుప్రీంకోర్టు, రాష్ట్రపతిని ఆశ్రయిండంతో కాస్త లేట్ అయ్యింది. అయితే కోర్టులన్నీ షాకివ్వడంతో ఆశలు అన్నీ ఆవిరైపోయాయి. మరోవైపు.. గురువారం కూడా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయంటూ నిర్భయ దోషులు పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిని ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు షాకిచ్చింది. ఇలా కోర్టులు, రాష్ట్రపతి నుంచి వరుస షాకులివ్వడంతో ఉరికి మార్గాలు సుగుమయ్యాయి. కాగా.. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను తలారీ ఉరి తీయనున్నారు.

ఇవాళ కోర్టులో ఏం జరిగింది!?

పవన్ గుప్తా దాఖలు చేసిన రెండో క్షమాభిక్ష పిటిషన్, సుప్రీంలో అతడు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నాయని.. తిహార్ జైలు సిబ్బందిపై పవన్ ఫిర్యాదు చేశాడని.. అక్షయ్ భార్య విడాకులు కోరుతూ బిహార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని.. తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ వినయ్ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందుకు పబ్లిక్ ప్రాసుక్కూటర్ మాట్లాడుతూ.. న్యాయపరమైన అవకాశాలు ఇంకేమీ మిగల్లేదని.. పవన్, అక్షయ్ మళ్లీ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను కూడా రాష్ట్రపతి తిరస్కరించారు. నా స్నేహితుడితో 100 పిటిషన్లు వేయించగలననన్నారు. అలాంటి పిటిషన్లను కూడా న్యాయపరమైన అవకాశాలుగా భావిస్తామంటే ఎలా? అంటూ ఇర్ఫాన్ అహ్మద్ కోర్టులో వాదనలు వినిపించారు.

స్పృహ తప్పిన అక్షయ్ భార్య..

ఇదిలా ఉంటే.. కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో నిర్భయ దోషి అక్షయ్ భార్య ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడిపోయింది. దాంతో అక్కడ కాసేపు కలకలం రేగింది. ఆమె కొన్నిరోజుల కిందటే తన భర్త నుంచి విడాకులు కోరుతూ డైవోర్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఢిల్లీ కోర్టు కూడా దోషుల పిటిషన్లను తిరస్కరించడంతో, ఇక రేపు వారి ఉరి ఖాయమేననిపిస్తోంది. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురునిందితులకు మరణశిక్ష అమలు చేయనున్నారు. మరి ఇవాళ సాయంత్రం కల్లా ఇంకా ఈ కేసులో ఎన్నెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో వేచిచూడాల్సిందే.

ఇదీ గతం..!

ఢిల్లీలోని పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై దక్షిణ ఢిల్లీలో ప్రాంతంలో ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారమైన విషయం విదితమే. 2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన అప్పట్లో కలకలం రేపింది.

More News

కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. ఇలా చేయండి..: చిరంజీవి

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ అన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్‌లో అందరి కంటే ముందుగా తన ‘ఆచార్య’ సినిమాను షూటింగ్‌ను

సంపర్క్ క్రాంతి-ఎస్9 : కరోనా భయంతో వణికిపోతున్న కరీంనగర్!

కరోనా పేరెత్తితో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌లు పెరిగిపోతుండటం.. మరోవైపు అనుమానిత కేసులు సైతం ఎక్కువవుతుండటంతో ప్రభుత్వాలు తగు

ఏపీకి వచ్చిన ఆ 185 మందికి కరోనా లేదు!

కరోనా వైరస్‌ మూలంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను కేంద్రం సహాయంతో స్వదేశానికి రప్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

'ఆర్ఆర్ఆర్' నుండి వైదొలుగుతున్న అలియా భట్ ?

బాహుబలి తర్వాత దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సిద్ధార్థ్‌తో రిలేష‌న్ గురించి స‌మంత ఏం చెప్పిందో తెలుసా?

హీరోయిన్‌గా స‌మంత కెరీర్ ప్రారంభంలో మంచి విజ‌యాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అదే స‌మ‌యంలో హీరో సిద్ధార్థ్‌తో కొంత‌కాలం రిలేష‌న్ షిప్ కొన‌సాగించింది.