నిర్భయ నిందితుల ఉరి మళ్లీ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలోని నిందితుల ఉరిశిక్ష ఇప్పట్లో అమలు అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ వ్యవహారం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. మంగళవారం ఉదయం ఆరు గంటలకే అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ లకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా పాటియాలా కోర్టు ఎవరూ ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఉరికి సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డెత్ వారెంట్‌పై స్టే విధిస్తున్నట్లు కోర్టు ఓ ప్రకటనలో తేల్చింది. ఈ కేసులోని నిందితులు పలుమార్లు సుప్రీం కోర్టు, పాటియాలా కోర్టులో పిటిషన్లు వేసుకోగా కోర్టులు కొట్టేశాయి. అయితే సోమవారం నాడు మరోసారి పవన్ గుప్తా పిటిషన్ వేయగా దానిపై సుధీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు.. ఉరి నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. మొత్తానికి చూస్తే ఇలా ఉరి వాయిదా పడటం మూడోసారి.
వాస్తవానికి నిందితులకు మంగళవారం ఉదయం ఉరిశిక్ష అమలుపై మొదట్నుంచీ సందిగ్ధత కొనసాగుతూనే వచ్చింది. ఆఖరికి అనుకున్నట్లుగానే ఉరి వాయిదా వేయడం జరిగింది. నిందితుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలన్న పవన్ విజ్ఞప్తిని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం తోసిపుచ్చింది. దోషికి ఉరి శిక్ష విధించడం సరైందేనని అభిప్రాయపడింది. ఇలా ప్రతీ సారి వాయిదా పడుతూ వస్తుండటంతో నిర్భయ తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్భయ తల్లి మీడియా ముందు కంటతడి పెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout