నీరవ్ మోదీ నోట.. నో కామెంట్.. 8 లక్షల జాకెట్!
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్లరూపాయిల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీ ఇండియా వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. సడన్‌గా ఆయన లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను బ్రిటన్ పత్రిక 'ద టెలిగ్రాఫ్' సీనియర్ రిపోర్టర్ మైక్ బ్రౌన్ ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించారు.
అయితే ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ నో కామెంట్.. నో కామెంట్ అని తప్ప.. సింగిల్ సమాధానం రాకపోవడం గమనార్హం. రిపోర్టర్ సుమారు పది ప్రశ్నలకు నీరవ్‌కు సంధించగా ప్రశ్నలన్నీ విన్న తర్వాత నో.. నో కామెంట్ అంటూ తిన్నగా రోడ్డు దాటుకుని క్యాబ్ ఎక్కి వెళ్లిపోయాడు.
కాగా.. నీరవ్ మోదీ రోజూ ఆయన ఉండే అపార్టుమెంటు నుంచి ఓ కార్యాలయానికి వెళ్లి వస్తుంటాడని తెలిసింది. ఆ కార్యాలయం ఆయన వ్యాపారానికి సంబంధించినదని మీడియా భావిస్తోంది. నీరవ్ మోదీ లండన్‌లోని వెస్ట్ ఎండ్ ప్రాంతంలో సుమారు రూ.72.9 కోట్ల ఖరీదైన మూడు పడకగదుల అపార్టుమెంట్లో ఉంటున్నారని ఇప్పటికే కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
జాకెట్ ఖరీదు 8 లక్షలు..!?
ఇదిలా ఉంటే.. వీడియోలో చూస్తున్నట్లుగా ఆయన ధరించి ఉన్న జాకెట్ రేటు రూ.8 లక్షలని తెలుస్తోంది. అంతేకాదు అలాంటి జాకెట్లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వేసుకోవట్లేదట. కానీ ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13వేల కోట్లు అప్పు చెల్లించాల్సి ఉండీ... అది చెల్లించకుండా... విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ మాత్రం దర్జాగా వేసుకుంటున్నాడని నెటిజన్లు, బాధితులు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout