జూలై 2న 'నిర్మల కాన్వెంట్' డిజిటల్ ట్రైలర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ టోటల్‌గా పూర్తయింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున చేసిన స్పెషల్ క్యారెక్టర్ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది. జైపూర్, అరకు, నైనిటాల్, చిక్‌మంగుళూరు వంటి డిఫరెంట్ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని ఎంతో లావిష్‌గా చిత్రీకరించారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం డిజిటల్ ట్రైలర్‌ను జూలై 2న విడుదల చేస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో సంక్రాంతి సూపర్‌హిట్ కొట్టిన కింగ్ నాగార్జున 'నిర్మల కాన్వెంట్' చిత్రంలో చేసిన స్పెషల్ క్యారెక్టర్‌తో మరోసారి అందర్నీ ఆకట్టుకోబోతున్నారు.
కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్, తాగుబోతు రమేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com