'నిను వీడని నీడను నేనే' సెకండ్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నీడ కోసం మనుషులు ఎదురు చూసేది ఎప్పుడు? ఎండ విపరీతంగా ఉన్నప్పుడు... వేసవిలో! మండుటెండల్లో నడిస్తే మన నీడ మనల్ని వెంటాడుతుంది. సేద తీరడం కోసం... మన నీడ కాకుండా చెట్టు నీడ లేదా మరో నీడ కోసం ఎదురు చూస్తాం. లేకపోతే... చిమ్మ చీకటిలో వెలుతురు మన మీద పడుతున్నప్పుడు నడిచినా మన నీడ మనల్ని వెంటాడుతుంది. హీరో సందీప్ కిషన్ నీ ఒక నీడ వెంటాడుతోంది. ఆ నీడ ఎవరు? ఆ నీడ వేంటాడటానికి కారణం ఏంటి? తెలియాలంటే... వేసవి వరకూ ఎదురు చూడాలి. మండుటెండల్లో థియేటర్లో మాంచి హారర్ ఎంటర్ టైనర్ చూపిస్తానని సందీప్ కిషన్ చెబుతున్నారు.
సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. విస్తా డ్రీమ్ మర్చంట్స్, కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తుంది. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్ విడుదల చేశారు. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ " సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. త్వరలో టీజర్, వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు - ఫణి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: కేఎల్ ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాకరన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com