'నిన్ను కోరి' ప్రమోషనల్ సాంగ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి., కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ సాంగ్‌ను ఈరోజు విడుదల చేశారు. 'అడిగా అడిగా ఎదలో లయలడిగా..' అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్‌కు శ్రీజో సాహిత్యాన్నందించగా సిధ్ శ్రీరామ్ గానం చేశారు.
నేచురల్ స్టార్ నాని, నివేథా థామస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్, నీతు, భూపాల్‌రాజ్, కేదార్‌శంకర్, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్ నేహంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సంగీతం: గోపీసుందర్, ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్: చిన్నా, స్టైలింగ్: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com