అక్కినేని హీరోతో 'నిన్నుకోరి' దర్శకుడు?

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

తొలి చిత్రం నిన్నుకోరి'తో ప్రేక్షకుల ఆద‌ర‌ణ‌తో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ. అలాగే ఆ చిత్ర నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టారు. ప్ర‌స్తుతం త‌న రెండో చిత్రం ప‌నుల‌తో ఈ యువ ద‌ర్శ‌కుడు బిజీగా ఉన్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టికే తన రెండవ సినిమాను అక్కినేని వారి అబ్బాయి నాగ చైతన్యతో చేయాలని ఫిక్స్ అవ్వడం...ఆ క్రమంలో చైతుకి కథను వినిపించడం....ఆ వెంటనే చైతు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం...అన్నీ చకచకా జరిగిపోయాయ‌ని తెలుస్తోంది. అయితే ఈ కథకి తుది మెరుగులు దిద్దడం కోసం ప్రముఖ రచయిత కోన వెంకట్ సాయం తీసుకుంటున్నారు ఈ దర్శకుడు. వచ్చే నెలకల్లా ఈ చిత్రానికి సంబంధించిన‌ ఫైనల్ రిపోర్ట్ వచ్చే అవకాశాలున్నాయి.

ఇదిలా వుంటే...నిన్నుకోరి' సినిమాని నిర్మించిన డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చైతు సవ్యసాచి' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిద‌శ‌కు చేరుకుంది. నిర్మాణానంతర పనులను పూర్తి చేసి మార్చిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన శైలజా రెడ్డి అల్లుడు' మూవీలో కూడా చైతు నటిస్తున్న సంగతి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాల‌ తదనంతరం చైతు.. శివ నిర్వాణ డైరెక్షన్‌లో న‌టించే అవ‌కాశం ఉంది. అలాగే విక్ర‌మ్ కుమార్‌తోనూ ఓ సినిమా చేయ‌బోతున్నారు చైత‌న్య‌.

More News

ఆగష్టు నుంచి యన్.టి.ఆర్ బయోపిక్

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యన్.టి.ఆర్’.

మళ్ళీ వార్తల్లోకి వెంకీ, పూరీ కాంబినేషన్

సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

కేరళ ప్రమెషన్ లో భాగమతి టీం

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ తొ సహ అన్ని ప్రమెషనల్ మెటిరియల్స్ కి

మ‌రో మెగా హీరోతో అను

సంక్రాంతికి విడుద‌లైన 'అజ్ఞాత‌వాసి' చిత్రంలో ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా సంద‌డి చేసింది కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. సూర్యకాంతం పాత్ర‌లో అమాయ‌కంగా కనిపించిన ఈ సుంద‌రి.. ప్ర‌స్తుతం మ‌రో మెగా హీరో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే చేస్తోంది.

ఆ ద‌ర్శ‌కుల‌కి ఓకే చెప్పిన గోపీచంద్‌

కుటుంబకథా చిత్రాల్లోనే మాస్, యాక్షన్ అంశాలను కూడా ఉండేటట్లు చూసుకునే క‌థానాయ‌కుడు గోపీచంద్. ఇటువంటి కథలతోనే ఒకప్పుడు వరుస హిట్లను అందుకున్న ఈ యాక్ష‌న్‌ హీరోకి.. 'లౌక్యం' త‌రువాత చేసిన సినిమాలేవీ విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాయి. ప్రస్తుతం డెబ్యు డైరెక్టర్ చక్రి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చేస్తున్నారు గోపీచంద్. మ