టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న'నిన్నే పెళ్లాడతా'

  • IndiaGlitz, [Thursday,October 31 2019]

ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్(రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్) ,సిద్ధిక హీరోహీరోయిన్లుగా వైకుంఠ బోను దర్సకత్వంలో బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం నిన్నే పెళ్లాడతా. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మంచి కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రమిది. హీరోహీరోయిన్లులతో పాటు సాయికుమార్, సీత, ఇంద్రజ ల నటన ఈ చిత్రంలో హైలెట్ గా వుంటుంది. మంచి ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది మా చిత్రం.

రెండు పాటలు, రెండు ఫైట్స్ మినహా టాకీ మొత్తం పూర్తయ్యింది. డిసెంబరు ఎండింగ్ లో సినిమారిలీజ్చెయ్యడానికిసన్నాహాలుచేస్తున్నాంఅన్నారు.అమన్,సిద్ధిక,సాయికుమార్,సీత,ఇంద్రజ,అన్నపూర్ణ,యోగి,కబీర్ సింగ్,విజ్జులేఖ,రామన్ తదితరులు

ఈ చిత్రానికి సంగీతం:నవనీత్,కెమెరా:ప్రసాద్ వీవీఎస్ఎన్, ఫైట్స్:రామకృష్ణ, డాన్స్:కళాధర్, విజయ్, సహ నిర్మాత:సాయి కొనెరి, నిర్మాతలు:బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు, కధ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం:వైకుంఠ బోను.