సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నిన్నే చూస్తు
Send us your feedback to audioarticles@vaarta.com
వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్ మరియు హేమలత (బుజ్జి) హీరో హీరోయిన్ గా నాటితరం హీరోయిన్ సుహాసిని మరియు సుమన్, భాను చందర్ ముఖ్య పాత్రలలో వి.ఎస్. ఫణీంద్ర దర్శకత్వం లో హేమలతా రెడ్డి నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం నిన్నే చూస్తు . ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుని ఇప్పుడు సరవేగంగా రెండోవ షెడ్యూల్ ప్రారంభం అయింది. హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా నిర్మాత హేమలతా రెడ్డి మాట్లాడుతూ " మా వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ లో 'నిన్నే చూస్తు' రెండొవ చిత్రం. మంచి కుటుంబకథ చిత్రం. సీనియర్ నటులు సుహాసిని గారు, సుమన్ గారు మరియు భాను చందర్ గారు ముఖ్య పత్రాలు చేస్తున్నారు. మా చిత్రం లో సుహాసిని గారు నటించటం మా అదృష్టం. వారు నటించిన సన్నివేశాలు చాల బాగా వచ్చాయి. మరొక ముఖ్య పాత్రలో సుమన్ గారు నటిస్తున్నారు. వారు చాల మంచి వారు, మా కుటుంబం లో ఒక భాగం గా కలిసిపోయారు. మొదటి షెడ్యూల్ అవుట్ ఫుట్ చూశాక చాలా సంతోషం గా ఉంది. సినిమా చాల బాగా వస్తుంది. ఇపుడు మేము రెండో షెడ్యూల్ మొదలు పెట్టాము , హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాము. షూటింగ్ పూర్తిచేసుకొని త్వరలోనే విడుదల చేస్తాము " అని అన్నారు
భాను చందర్, సుమన్ , కినెర , కాశీ విశ్వనాధ్ , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్, జోతిరెడీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వి.ఎస్. ఫనీంద్ర, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర, ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com