ఒకే కుటుంబానికి చెందిన 9 మంది గల్లంతు..
Send us your feedback to audioarticles@vaarta.com
వర్షాలు బీభత్సానికి హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో ఆస్తి నష్టంతో పాటు... ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. రాజేంద్రనగర్ పల్లె చెరువు కట్ట తెగడంతో మైలార్ దేవుపల్లి అలీ నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. కాగా గల్లంతైన వారిలో.. దార్కస్ ఖురేషీ , ఫర్జానా తబస్సుమ్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఏ క్షణమైనా పల్లె చెరువు కట్ట పూర్తిగా తెగే అవకాశం ఉంది. పూర్తిగా తెగితే అలీ నగర్, అల్ జుబేల్ కాలనీ పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెల్లవార్లూ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలైన అలీ నగర్, సుబాన్ కాలనీ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.
వరదల కారణంగా భయం గుప్పిట్లో గడిపిన మూసీ పరివాహక ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరదల కారణంగా చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, రసూల్‌పురా, భూలక్ష్మి మాత వెనుక బస్తీ.. తదితర ప్రాంత వాసులు నిరాశ్రయులయ్యారు. ప్రాణ భయంతో సర్వస్వం వదిలేసి బతుకు జీవుడా అంటూ బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వరద తగ్గినప్పటికీ బస్తీలన్నీ బురదమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే మూసీ ప్రాంత వాసులు తిరిగి ఇళ్లకు చేరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments