కరోనా వ్యాక్సిన్ విషయమై గుడ్ న్యూస్ చెప్పిన నిమ్స్ వైద్యుడు
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణలో నిమ్స్‌ను క్లినికల్ ట్రయల్స్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ ఒకటి నిమ్స్ వైద్యుడు వెల్లడించారు. నిమ్స్‌లో జరుగుతున్న మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
నేడు ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. వారం రోజుల్లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని వెల్లడించారు. మొదటి దశలో 50 మందితో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ ప్రయోగించిన వ్యక్తులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని శ్రీనివాస్ వెల్లడించారు. కరోనా నుంచి కోలుకోవటం అనేది ఆయా వ్యక్తుల యొక్క ఇమ్యూనిటీని బట్టి ఉంటోందన్నారు. ఐసీఎంఆర్ ఉత్తర్వుల మేరకు నిమ్స్ నుంచి వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout