కరోనా వ్యాక్సిన్ విషయమై గుడ్ న్యూస్ చెప్పిన నిమ్స్ వైద్యుడు

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణలో నిమ్స్‌ను క్లినికల్ ట్రయల్స్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ ఒకటి నిమ్స్ వైద్యుడు వెల్లడించారు. నిమ్స్‌లో జరుగుతున్న మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

నేడు ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. వారం రోజుల్లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని వెల్లడించారు. మొదటి దశలో 50 మందితో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ ప్రయోగించిన వ్యక్తులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని శ్రీనివాస్ వెల్లడించారు. కరోనా నుంచి కోలుకోవటం అనేది ఆయా వ్యక్తుల యొక్క ఇమ్యూనిటీని బట్టి ఉంటోందన్నారు. ఐసీఎంఆర్ ఉత్తర్వుల మేరకు నిమ్స్ నుంచి వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.

More News

ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులు..

ఏపీకి వెళ్లాలనుకునే వారు ఇకపై పెద్దగా షరతులేమీ లేకుండా సులువుగా వెళ్లవచ్చు

ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డిపై ఇళ‌య‌రాజా ఫిర్యాదు

త‌న‌ను బెదిరిస్తున్నార‌ని, త‌న స్టూడియోను ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌ముఖ సంస్థ ప్ర‌సాద్ ల్యాబ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డు

మూడు రాజధానులపై పవన్ ఏమన్నారంటే...

ఏపీలో శుక్రవారం చోటు చేసుకున్న కీలక పరిణామంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

దేశంలో షాకిస్తున్న కరోనా.. నేడు 57 వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు షాక్‌కు గురి చేస్తున్నాయి. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

తెలంగాణలో నేడు 2 వేలు దాటిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.