ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ వేసిన నిమ్మగడ్డ
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఏపీ ప్రభుత్వానికి మధ్య మళ్లీ అగ్గి రాజుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని రమేష్ కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సైతం ప్రభుత్వం సహకరించడం లేదని రమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని రమేష్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాన్ని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout