నిమ్మగడ్డ కేసులో గవర్నర్ సంచలన నిర్ణయం.. జగన్‌కు షాక్
- IndiaGlitz, [Wednesday,July 22 2020]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఆయన కేసులో గవర్నర్ విశ్వభూషన్ హరించందన్ సంచలన నిర్ణయం తీసుకుని ఏపీ సీఎం జగన్‌కు షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా కొనసాగించాలని గవర్నర్.. ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. గవర్నర్‌ను కలవాలంటూ హైకోర్టు సూచించడంతో రమేష్ కుమార్ విశ్వభూషన్‌ను కలిశారు. గవర్నర్‌కు తనను ఎస్ఈసీగా నియమించాలంటూ వినతిపత్రం సమర్పించారు. హకోర్టు తీర్పును అమలు పరచాలని కోరారు. దీంతో గవర్నర్ నేడు ఎస్ఈసీగా రమేష్ కుమార్‌ను నియమించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
కాగా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఇటీవల జరిగిన విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై గత శుక్రవారం విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. అక్కడ దీనిపై పలు మార్లు విచారణ జరిగినప్పటికీ సుప్రీంకోర్టు స్టే రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రమేష్ కుమార్ వెళ్లి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలకు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. గవర్నర్‌ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది.. వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు తీర్పు అమలు చేయాలని గవర్నర్‌ను కోరాలని చెప్పింది. అయితే గవర్నర్‌ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నామన్న నిమ్మగడ్డ లాయర్ కోర్టుకు తెలిపారు.