ఈ-వాచ్ యాప్‌ను ప్రారంభించిన నిమ్మగడ్డ.. కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
Send us your feedback to audioarticles@vaarta.com
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవకతవకలూ జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భారీగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్‌ను ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం ఈ-వాచ్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా సరే.. నేరుగా ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎస్‌ఈసీ రమేష్ కుమార్ మాట్లాడుతూ... గతంలో కూడా పలు ఎన్నికలకు సాంకేతికతను జోడించారన్నారు. టెక్నాలజీ ద్వారా ఎన్నికల్లో పారదర్శకత, నమ్మకం కలుగుతుందని నిమ్మగడ్డ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిఘా యాప్‌పై నిమ్మగడ్డ మాట్లాడుతూ.. ఆ యాప్‌ను ఎస్‌ఈసీని సంప్రదించకుండా రూపొందించారన్నారు. ఈ-వాచ్ యాప్‌ను ఈసీ అవసరాలకు అనుగుణంగానే రూపకల్పన చేశామని ఆయన చెప్పుకొచ్చారు. జియో యాప్‌లో అంతర్భాగం చేయాలనుకున్నప్పటికీ సాంకేతిక సమస్యలొచ్చాయన్నారు. కాల్ సెంటర్ సిబ్బందిపై ఎప్పటికప్పుడు తమ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. మొదట్లో ఇబ్బందులు వచ్చినా అన్నీ పరిష్కరించుకుంటామన్నారు. ఫిర్యాదులు గోప్యంగా, సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుని పరిష్కరిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
ఈ-వాచ్ యాప్‌పై లంచ్‌మోషన్ పిటిషన్
ఈ-వాచ్ యాప్‌పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం లంచ్‌మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని ఏపీ హైకోర్టు తెలిపింది. భద్రతాపరమైన అనుమతులు లేకుండా యాప్‌ను..
రహస్యంగా తయారు చేశారని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థలో యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలంటే.. అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. పంచాయతీరాజ్‌శాఖ యాప్ ఉండగా ఈ-వాచ్ యాప్ ఎందుకు? అని ప్రభుత్వం ప్రశ్నించింది. కొన్ని పార్టీలకు లబ్ధి చేకూర్చేలా యాప్ ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout