అల్లు శిరీష్ జోడీగా నిక్కి గల్రాని
Send us your feedback to audioarticles@vaarta.com
తాజాగా అల్లు శిరీష్ ప్రేయసిగా నిక్కి గల్రాని నటిస్తోంది. అల్లు శిరీష్ నటిస్తున్న వార్ డ్రామా 1971: బియాండ్ బార్డర్స్ లో ఆమె కథానాయికగా ఎంపికైంది. మేజర్ రవి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మేజర్ రవి మాట్లాడుతూ ``ఇందులో నిక్కి తమిళ అమ్మాయిగా నటిస్తోంది. జనవరిలో తన పోర్షన్ ను పొల్లాచ్చిలో చిత్రీకరిస్తాం`` అని అన్నారు.
తెలుగు, తమిళ్, మలయాళంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో కనిపించే ఈ సినిమా గురించి నిక్కి మాట్లాడుతూ ``నా చేతుల్లో ప్రస్తుతం ఐదు తమిళ ప్రాజెక్టులున్నాయి. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మోహన్‌లాల్‌గారి సినిమా అనగానే థ్రిల్ ఫీలయ్యాను. ఇందులో అల్లు శిరీష్ పక్కన నటించడం ఆనందంగా ఉంది`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments