మొత్తానికి షాకిచ్చారుగా.. నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి నిశ్చితార్థం, ఫొటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో మరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పెళ్లిపీటలెక్కనున్నాడు. ఆయన ఎవరో కాదు. ఆది పినిశెట్టి. కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఈ జంట ఎక్కడ వీటిని ఖండించలేదు. తర్వాత ఈ వ్యవహారం గురించి అంతా మరిచిపోయారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇండస్ట్రీకి, అభిమానులకు షాకిచ్చారు. మార్చి 24న స్నేహితులు, బంధువుల సమక్షంలో తమకు నిశ్చితార్ధం జరిగినట్లు వెల్లడించారు. త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బుజ్జిగాడు' ఫేమ్ సంజనా గల్రానీ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిక్కీ గల్రానీ. కోలీవుడ్‌లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. 'యాగవరాయినుం నా కాక్క' అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నటించింది నిక్కీ. ఈ సినిమాను తెలుగులో 'మలుపు' పేరుతో విడుదల చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.
ఇక ఆది పినిశెట్టి విషయానికొస్తే.. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హీరోగా, విలన్ గా కొన్ని సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆది నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తోన్న 'ది వారియర్' సినిమాలో విలన్ గా కనిపించనున్నారు ఆది పినిశెట్టి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com