విజువల్ వండర్ ' శరభ' లో నిఖిత ఐటెం సాంగ్...

  • IndiaGlitz, [Tuesday,August 30 2016]

కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా య‌న్‌.న‌ర‌సింహా రావ్ ద‌ర్శ‌క‌త్వంలోఅశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం శరభ. 20 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌గ్గ‌ర పలు చిత్రాల‌కు అసోసియేట్‌గా వ‌ర్క్ చేసిన న‌ర‌సింహా రావ్ సోషియో ఫాంట‌సీ బ్యాక్‌డ్రాప్‌లో హ్యుమ‌న్ ఏమోష‌న్స్ తో పాటు హై టెక్నికల్ వాల్యూస్ తో విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో కోటి మ్యూజిక్ డైరెక్షన్ కంపోజ్ చేసిన మాస్ బీట్ లో నిఖిత నర్తించనుంది. బాబా భాస్కర్ సినిమాకు నృత్య రీతులను సమకూరుస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో జరగుతున్న ఈ సాంగ్ లో 50 మంది డ్యాన్సర్స్, 300 జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్నారు. క్వాలిటీ, మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అన్ కాంప్రమైజ్డ్ గా సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ తెలియజేశారు. సినిమా చాలా బాగా వ‌స్తుంది. అన్నీ వ‌ర్గాల‌ను అల‌రించే మంచి సినిమా అవుతుందని ద‌ర్శ‌కుడు ఎన్‌.న‌ర‌సింహారావ్ అన్నారు.

More News

క్రికెట్ ఆడుతున్న బాహుబలి 2 టీమ్..!

దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2.

మలయాళ రీమేక్ లో అల్లరి నరేష్

తమిళ్ పడం రీమేక్ గా తెలుగులో రూపొందిన సుడిగాడు చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్

పవర్ స్టార్ అంతరంగం..!

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(UKTA)ఆరవ వార్షికోత్సవ వేడుకలు జయతే కూచిపూడి,జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సి లో ఇటీవల ఘనంగా నిర్వహించారు.

'త్రివిక్రమన్' ప్రచార చిత్రం విడుదల!!

"త్రివిక్రమపాండ్యన్" అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన ఒక బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా రూపొందిన చిత్రం "త్రివిక్రమన్".

'మజ్ను' ఆడియో రిలీజ్ డేట్....

భలే భలే మగాడివోయ్,జెంటిల్ మన్ వంటి వరుస సక్సెస్ లు సాధించిన నేచురల్ స్టార్ నాని