'గాయత్రి' చిత్రంలో కీలక పాత్రలో నిఖిల విమల్
Send us your feedback to audioarticles@vaarta.com
డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. కాగా చిత్ర బృందం ప్రధాన తారాగణం పరిచయ పోస్టర్లు ఒక దాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. క్రిస్మస్ కు విడుదల చేసిన మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ కు విశేష స్పందన వచ్చింది. గాయత్రిలో విష్ణు మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. శ్రియ ఆయన సరసన నటిస్తుంది.
కొత్త సంవత్సరం నాడు విష్ణు, శ్రియలు ఆదర్శ దంపతులుగా కనిపించే పోస్టర్ కు కూడా మంచి స్పందనే వచ్చింది. తాజాగా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నిఖిల విమల్ పోస్టర్ ను విడుదల చేసారు. "నేను ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నానంటే దానికి కారణం మా నాన్న" అని పోస్టర్ పై ఉన్న కాప్షన్ బట్టి ఆమెది కథలో ప్రాధాన్యత ఉన్న పాత్ర అని తెలుస్తోంది.
బ్రహ్మానందం మరియు అనసూయ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com