'పెళ్ళి చూపులు' దర్శకుడితో నిఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్న యువ కథానాయకుల్లో నిఖిల్ ఒకరు. అలాగే తన మొదటి సినిమా పెళ్ళి చూపులు`తోనే భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతోందని టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ యువ దర్శకుడు నిఖిల్‌కు ఓ ఆసక్తికరమైన కథను వినిపించారని సమాచారం. వైవిధ్యభరితమైన కథలకి ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నిఖిల్....తరుణ్ చెప్పిన స్టోరీ కూడా కొత్తగా ఉండడంతో వెంటనే ఓకే చేసేశారని తెలిసింది.
ప్రస్తుతం తమిళ సినిమా కణితన్` తెలుగు రీమేక్ వెర్షన్లో నటిస్తున్నాడు నిఖిల్. అలాగే తరుణ్ భాస్కర్ కూడా కొత్త నటీనటులతో....సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే తమ కాంబినేషన్ సినిమాని పట్టాలెక్కిస్తారని ఇన్సైడ్ సోర్స్ టాక్. కాగా, నిఖిల్ తాజా చిత్రం కిరాక్ పార్టీ` విడుదలకి సిద్ధమవుతోంది. బహుశా.. ఈ నెల 23న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments