'పెళ్ళి చూపులు' దర్శకుడితో నిఖిల్

  • IndiaGlitz, [Thursday,February 15 2018]

చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్న యువ క‌థానాయ‌కుల్లో నిఖిల్ ఒక‌రు. అలాగే త‌న మొద‌టి సినిమా పెళ్ళి చూపులు'తోనే భారీ విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు తరుణ్ భాస్కర్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతోందని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ యువ‌ దర్శకుడు నిఖిల్‌కు ఓ ఆస‌క్తిక‌ర‌మైన కథను వినిపించారని సమాచారం. వైవిధ్యభ‌రిత‌మైన కథలకి ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నిఖిల్....త‌రుణ్ చెప్పిన స్టోరీ కూడా కొత్తగా ఉండడంతో వెంట‌నే ఓకే చేసేశారని తెలిసింది.

ప్రస్తుతం తమిళ సినిమా కణితన్' తెలుగు రీమేక్ వెర్ష‌న్‌లో న‌టిస్తున్నాడు నిఖిల్. అలాగే తరుణ్ భాస్కర్ కూడా కొత్త నటీనటులతో....సురేష్ ప్రొడక్షన్ సంస్థ‌లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్త‌య్యాకే త‌మ కాంబినేష‌న్‌ సినిమాని పట్టాలెక్కిస్తారని ఇన్‌సైడ్‌ సోర్స్ టాక్. కాగా, నిఖిల్ తాజా చిత్రం కిరాక్ పార్టీ' విడుద‌ల‌కి సిద్ధ‌మ‌వుతోంది. బ‌హుశా.. ఈ నెల 23న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశ‌ముంది.

More News

'అ!' లో కాజల్ పాత్రే కీలకమట

కొత్తగా వచ్చే నటీనటులకి పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి విజయాలు అవసరం.

నాగ్ , నాని మూవీలో కన్నడ నటి

కింగ్ నాగార్జున,నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోంది.

'సైరా నరసింహారెడ్డి' కొత్త షెడ్యూల్ అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'కొత్తగా ఉన్నాడు' ఆడియో వేడుక

తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం `కొత్తగా ఉన్నాడు'.

సైకలాజికల్ లవ్ స్టోరీగా మసక్కలి

కొన్ని కథలు విని నమ్ముతాం..కొన్ని కథలు చూసి నమ్ముతాం..మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి..