నానితో నిఖిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస ఎనిమిది విజయాలు సాధించిన నేచురల్ స్టార్ నానికి కృష్ణార్జున యుద్ధం కాస్త బ్రేక్ వేసింది. తర్వాత నాగార్జునతో నాని కలిసి నటించిన మల్టీస్టారర్ దేవదాస్ కూడా నిరాశనే మిగిల్చింది. ప్ర్రస్తుతం నాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో `జెర్సీ` సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాని .. తనకు హీరోగా `అష్టాచమ్మా`తో లైఫ్ ఇవ్వడమే కాకుండా `జెంటిల్మన్` వంటి హిట్ మూవీని ఇచ్చిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇదొక మల్టీస్టారర్ అని సమాచారం. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఇంద్రగంటికి ఈ మల్టీస్టారర్లో నటించబోయే మరో హీరో కూడా దొరికేశాడని సమాచారం. ఆ హీరో ఎవరో కాదు. నిఖిల్. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరిలో స్టార్ చేయడానికి ఇంద్రగంటి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments