నిఖిల్ రెండు చిత్రాలు అలాగే..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నిఖిల్ గత రెండేళ్ళుగా ఏడాదికో సినిమాతో సందడి చేసారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విశేషమేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలు కావడం. కాస్త వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న నిఖిల్ తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' విడుదల కానుంది.
శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కన్నడంలో మంచి విజయం సాధించిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్‌గా తెరకెక్కింది. సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరింజా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గత నెల 9న విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు 16న రిలీజ్ కాబోతోంది.
అలాగే ఈ ఏడాదిలో మరో సినిమాతో నిఖిల్ సందడి చేసే అవకాశముంది. అయితే అది కూడా రీమేక్ చిత్రం కావడం గమనార్హం. తమిళంలో విజయం సాధించిన 'కణితన్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఒరిజనల్ వెర్షన్ డైరెక్టర్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ముద్ర' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. మొత్తమ్మీద.. ఈ ఏడాదిలో వచ్చే నిఖిల్ రెండు చిత్రాలు కూడా రీమేక్ కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com