విజ‌య్ దేవ‌ర‌పై నిఖిల్ ట్వీట్‌.. తొల‌గింపు

  • IndiaGlitz, [Thursday,October 11 2018]

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న నోటా సినిమా పోయింది.. పండ‌గ చేసుకునేవాళ్లు ఇప్పుడే పండ‌గ చేసుకోసుకోండి. ఐ యామ్ బ్యాక్ అంటూ ఓ మెసేజ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అయితే దీనికి నిఖిల్ ''కొంత మంది ప్ర‌పంచం మొత్తం తిరుగుతుంద‌ని భావిస్తుంటారు. అన‌వ‌స‌ర‌మైన యాట్యిట్యూడ్ చూపించేవారు కొంత మంది ఉంటారు. కానీ గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమంటే వాళ్లే అంత ముఖ్య‌మైన వ్య‌క్తులేం కాదు. ప్ర‌తి ఆర్టిస్టు.. త‌న‌తో తానే పోటీ ప‌డుతూ ఉంటాడు. ఇక్క‌డ అలాంటి వాళ్లు సింధువులో బిందువులాంటివాళ్లు మాత్ర‌మే. ముఖ్యంగా సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌ను గురించి తాము ఎక్కువ‌గా ఊహించుకోవ‌ద్దు. ఆ ఎక్కువ ప‌నిలో చూపించాలి'' అంటూ విజ‌య్ దేవ‌ర కొండ‌ను టార్గెట్ చేస్తూ ఇన్ డైరెక్ట్‌గా త‌న ట్విట్ట‌ర్ మెసేజ్ పోస్ట్ చేసిన నిఖిల్‌..కాసేప‌టికే తొలిగిస్తూ 'నేను ఎవ‌రినీ టార్గెట్ చేస్తూ చేసిన మెసేజ్ కాదు' అంటూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

More News

'ఐరా'గా న‌య‌న‌తార‌

ప్ర‌స్తుతం లేడీ సూప‌ర్‌స్టార్‌గా సౌత్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉంది న‌య‌న‌తార‌. ఈమె న‌టించిన చిత్రాలు త‌మిళంలో అగ్ర హీరోల చిత్రాల రేంజ్‌లో ఆద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం.

తాప్సీ 'గేమ్ ఓవ‌ర్‌'

ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ త‌ర్వాత `బేబి, నామ్ ష‌బానా, పింక్‌, జుడ్వా 2` చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షురూ..

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది.. నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న...

'స‌ర్కార్' టీజ‌ర్ డేట్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి `స‌ర్కార్` అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

నానా ప‌టేక‌ర్‌కు వ‌ర్మ స‌పోర్ట్‌

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా పటేక‌ర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని హీరోయిన్ త‌ను శ్రీద‌త్తా ఓ సంద‌ర్భంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో మీ టూ ఉద్య‌మం ప్రారంభ‌మైంది.