మెగాఫోన్ పట్టనున్న నిఖిల్..?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నిఖిల్ కథానాయకుడిగా 18 పేజీస్, కార్తికేయ2 చిత్రాలు రూపొందనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలోనే నిఖిల్ తన సినిమాల షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నాడు. అంతే కాకుండా మరో వైపు నిఖిల్ మెగాఫోన్ పట్టనున్నారని సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం నిఖిల్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నిఖిల్ తెలియజేశాడు. పూర్తిస్థాయి ఎక్స్‌పెరిమెంటల్ మూవీగా నిఖిల్ సినిమాను చేయబోతున్నాడట. పిల్లలే ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతా ఓకే అయిన తర్వాత త్వరలోనే నిఖిల్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తారట.
ప్రస్తుతం జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా 18పేజీస్ సినిమా రూపొందనుంది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కార్తికేయకు సీక్వెల్‌గా కార్తికేయ 2 తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 18 పేజీస్ చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే కార్తికేయ 2 సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments