భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్న నిఖిల్
- IndiaGlitz, [Sunday,February 02 2020]
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. డాక్టర్ పల్లవితో కలిసి నిఖిల్ ఏడు అడుగులు వేయబోతున్నాడు. ఇన్నిరోజులుగా ప్రేమలో మునిగి తేలిన ఈ లవ్ బర్డ్స్ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. గోవాలో అమ్మాయిని ఒప్పించిన నిఖిల్ అక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఫిబ్రవరి-01న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఆయన.. ఏప్రిల్-16న పెళ్లాడబోతున్నాడు.
కాగా.. ఇటీవలే ‘అర్జున్ సురవరం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడవుతున్నాడు. అయితే పెళ్లి ఎక్కడ జరుపుతున్నారు..? హైదరాబాద్‌లోనా..? లేదా భీమవరంలోనా లేకుంటే మరోచోట పెళ్లి జరగబోతోందా..? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.