నిఖిల్ కూడా బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నాడు...
- IndiaGlitz, [Tuesday,September 22 2015]
కెరీర్ ప్రారంభంలో హ్యపీడేస్', యువత' వంటి సినిమాలతో విజయాలను అందుకున్న యంగ్ హీరో నిఖిల్ తర్వాత వరుస ప్లాప్స్ ను మూటగట్టుకున్నాడు. అయితే స్వామిరారా', కార్తికేయ', సూర్య వర్సెస్ సూర్య' వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ వచ్చాడు.
ప్రస్తుతం శంకరాభరణం' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నిఖిల్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు. అది కూడా చీరలకు, ఏంటి హీరో చీరలను ప్రమోట్ చేస్తాడా అనే డౌట్ వస్తుంది. అయితే తన నటించనున్నయాడ్ లో చాలా మంది మోడల్స్ తో నిఖిల్ నటించున్నాడట. ఇది కళామందిర్ వారికి సంబంధించిన యాడ్ , అల్రెడి గ్రౌండ్ వర్క్ స్టార్టయిందట. త్వరలోనే టీవీలో నిఖిల్ సందడి స్టార్ట్ కానుందన్నమాట.