నిఖిల్ మ‌ళ్లీ టార్గెట్ చేశాడా?

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

'హ్యాపీడేస్' కోసం న‌లుగురు హీరోల్లో ఒక‌డిగా న‌టించి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టినా.. ఆ త‌రువాత 'యువ‌త‌'తో హిట్ కొట్టినా.. 'స్వామి రా..రా..'తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చినా.. హీరో నిఖిల్ కెరీర్ గ్రాఫ్‌ని మార్చింది మాత్రం 'కార్తీకేయ' సినిమానే. ఈ చిత్రం ఊహించ‌ని విధంగా నిఖిల్ స్థాయిని మార్చేసింది. గ‌తేడాది దీపావ‌ళి సీజ‌న్‌లో ఈ సినిమా విడుద‌లైంది.

క‌ట్ చేస్తే.. స‌రిగ్గా మ‌ళ్లీ ఏడాదికి దీపావ‌ళినే త‌న కొత్త సినిమాకి టార్గెట్ చేసుకున్నాడట నిఖిల్‌. 'శంక‌రాభ‌ర‌ణం' పేరుతో తెర‌కెక్కుతున్న స‌ద‌రు చిత్రం దీపావ‌ళి కానుక‌గా వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌న్న‌ది విశ్వ‌స‌నీయ స‌మాచారం. మ‌రోసారి నిఖిల్‌కి దీపావ‌ళికి క‌లిసొస్తుందా? వెయిట్ అండ్ సీ.

More News

మ‌ళ్లీ అలాగే వ‌స్తున్న అనుష్క‌

సినిమా వారికి సెంటిమెంట్స్ ఎక్కువ‌. ఓ సారి క‌లిసిరాని అంశంతోనే రెండోసారీ ఓ సినిమా తెర‌కెక్కుతుందంటేనే స‌ద‌రు చిత్రం ఫ‌లితంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తారు.

విక్ర‌మ్‌తో పోటీప‌డుతున్న న‌య‌న‌తార‌

విక్ర‌మ్, న‌య‌న‌తార.. ఈ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా రాలేదు. గ‌తంలో వీరి క‌ల‌యిక‌లో సినిమా తీయాల‌ని త‌మిళ ఫిల్మ్‌మేక‌ర్స్ ప్ర‌య‌త్నించినా ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

మూడేళ్ల‌పాటు నంద‌మూరి హీరోల‌తో

గ‌తేడాది వ‌ర‌కు టాలీవుడ్‌లో ఆమెకు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది. అయితే ఒకే ఒక్క సినిమా ఆమె జాత‌కాన్నే మార్చేసింది. ఆ త‌రువాత వ‌ద్ద‌న్నా అవ‌కాశాలు ఆమె కోసం వేచి చూస్తున్నాయి.

'స్నేహమేరా జీవితం' మోషన్ పోస్టర్ విడుదల

‘ఇది మా అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ’ సినిమాతో తెరంగేట్రం చేసి ‘ఆర్య’, ‘సంక్రాంతి’, ‘పోతేపోనీ’, ‘చంద‌మామ‌’, ‘శంభో శివ శంభో’వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ

'నువ్వే కావాలి' కి 15 ఏళ్లు

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ''నువ్వే కావాలి''ది ప్రత్యేక స్థానం.అప్పటివరకు బాలనటుడుగానే పరిచయమున్న తరుణ్ ఈ సినిమాతోనే కథానాయకుడుగా తొలి అడుగులు వేశాడు.