హిట్ ద‌ర్శ‌కుడితో నిఖిల్‌

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

హ్య‌పీడేస్‌తో తెరంగేట్రం చేసిన హీరో నిఖిల్ త‌ర్వాత యువ‌త చిత్రంతో కూడా మంచి స‌క్ససే అందుకున్నాడు. అయితే త‌ర్వాత అన్నీ ప్లాప్ చిత్రాల్లో భాగ‌మ‌య్యాడు. ఇక క‌ష్ట‌మ‌నుకుంటున్న త‌రుణంలో సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్వామిరారా సుధీర్ వ‌ర్మ కెరీర్‌ను మార్చేసింది. ఆ హిట్‌తో ఊపిరి తీసుకున్నాడు. త‌ర్వాత కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య చిత్రాల్లో న‌టించి మెప్పించాడు.

ఇప్పుడు ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. నిజానికి సుధీర్‌వ‌ర్మ ర‌వితేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ర‌వితేజ, చ‌క్రిల సినిమా వెన‌క్కి వెళుతుండ‌టంలో సుధీర్ సినిమా ఆల‌స్య‌మ‌వుతుంది. దాంతో సుధీర్ వ‌ర్మ, నిఖిల్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇప్పుడు క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డాడు. అన్నీ అనుకున్న‌ట్లుగా కుదిరితే నిఖిల్ ఎస్ చెప్పేస్తాడ‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.