Spy:'నేతాజీ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో మరణించడం ఒక కవర్ స్టోరీ' .. నిఖిల్ 'స్పై' టీజర్ వచ్చేసిందోచ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఇండియాలో ‘‘స్పై’’ జోనర్ల హవా నడుస్తోంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో మన స్టార్లంతా గూఢచారులుగా మారిపోతున్నారు. ఇప్పటి తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన ‘‘ఏజెంట్’’ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ కోవలో తెలుగులోనే వస్తున్న ఇదే తరహా మూవీ ‘‘స్పై’’. కార్తీకేయ 2తో అనుకోకుండా పాన్ ఇండియా స్టార్ అయిన నిఖిల్ ఈ సినిమాతో మరోసారి దేశవ్యాప్తంగా తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఆల్‌మోస్ట్ షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగా సోమవారం స్పై నుంచి టీజర్ రిలీజ్ చేశారు. న్యూఢిల్లీలోని ఐకానిక్ ల్యాండ్‌మార్క్ కర్తవ్య్ పథ్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద స్పై టీజర్‌ను ఆవిష్కరించారు.
నేతాజీ డెత్ మిస్టరీ చుట్టూ స్పై కథ:
టీజర్ విషయానికి వస్తే.. స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం , దాని వెనుక వున్న మిస్టరీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. నేతాజీకి సంబంధించిన ఫైల్ మిస్ అయ్యిందని.. దానిని వెతికే క్రమంలో హీరో సుభాష్ చంద్రబోస్ గురించి ఏం తెలుసుకున్నారన్నదే కథ. టీజర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ ఛేజింగ్‌లు, బాంబ్ బ్లాస్ట్‌లతో ఉత్కంఠ భరితంగా కట్ చేశారు. చూస్తుంటే నిఖిల్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేలాగా కనిపిస్తోంది.
స్పై కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ :
స్పై చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి కథ కూడా ఆయనే అందిస్తుండటం విశేషం. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూరుస్తుండగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆర్యన్ రాజేశ్, అభినవ్ గోమటం, మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లీ విటేకర్ అండ్ రాబర్ట్ లిన్నెన్‌లు స్పై మూవీ కోసం పనిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments