క‌రోనా నివార‌ణకు అత్యవ‌ర‌స‌మైన ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందించిన నిఖిల్ సిద్ధార్థ‌

  • IndiaGlitz, [Monday,March 30 2020]

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలానే యావ‌త్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖులు సైతం త‌మ వంతుగా ఆర్ధిక స‌హ‌క‌రాలు అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ కూడా ముందుకొచ్చారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు ముందు వ‌ర‌స‌లో ఉండి యుద్ధం చేస్తున్న డాక్ట‌ర్స్ కి, మెడిక‌ల్ సిబ్బందికి చేయుత‌గా వారి ర‌క్ష‌ణ‌కి అత్యఅవ‌స‌ర‌మైన‌ ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్స్ కిట్స్ భారీగా అందించారు.
 
2000 ఎన్ 95 రెస్పిరేట‌ర్లు
2000 రీ యూజ‌బుల్ గ్ల‌వ్స్
2000 ఐ ప్రొట‌క్ష‌న్స్ గ్లాస్లులు, శానిటైజ‌ర్లు
10000 ఫేస్ మాస్క‌లు
 
ఈ ప్రొట‌క్ష‌న్ కిట్స్ అన్నిటిని గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టెంట్ అధికారుల‌కి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అంద‌జేయడం విశేషం. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ క‌రోనా నివార‌ణ మ‌నంద‌రికి ఎంత ముఖ్య‌మో, డాక్ట‌ర్లునీ సైతం ఆ క‌రోనా భారీన ప‌డ‌కుండా, వారికి శ్ర‌మ క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డం కూడా అందే ముఖ్యం. డాక్ట‌ర్ల‌తో పాటు మిగిలిన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మున్సిప‌ల్ కార్మికులు, అధికారులు మనంద‌రి కోసం ఎలాంటి ప్ర‌మాదాన్ని లెక్క చేయ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. అందుకు నా వైపు కృత‌జ్ఞ‌త‌గా ఈ ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందిస్తున్నాను. క‌రోనా నివార‌ణ జ‌ర‌గాలంటే మ‌నంద‌రం ఇంటిలోనే ఉంటూ ఆరోగ్య ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ 21 రోజుల లాక్ డౌన్ కి మ‌నంద‌రం స‌హ‌క‌రించాలి అని అన్నారు.

More News

సినీ కార్మికుల కోసం ముందుకొచ్చిన తారాలోకం

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో దేశ‌మంత‌టా స్తంభించి పోయింది. ప‌లు రంగాలు ఆగిపోయాయి. అందులో ప‌నిచేసే ప‌లువురు కార్మికుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.

కరోనా లాక్‌డౌన్‌తో మద్యం దొరకలేదని ఆత్మహత్యాయత్నం!

కరోనా నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు. మరోవైపు నిత్యావసర సరకులకు సంబంధించిన షాపులు మాత్రం ఉదయం

స్పెయిన్ యువరాణిని బలితీసుకున్న కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా కాటుతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే కన్నుమూశారు. అయితే తాజాగా కరోనాతో ఇన్నిరోజులు పోరాడిన స్పెయిన్ యువరాణి మారియా థెరీసా

మీ అసౌకర్యానికి చింతిస్తున్నా.. కఠిన నిర్ణయాలు తప్పవ్..!

కరోనా నేపథ్యంలో దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు (లాక్‌డౌన్‌) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఆ విష‌యంలో నేనేం మార‌లేదు: రాజ‌మౌళి

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్‌స్టార్స్ అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’.