సినిమా కోసం హనీమూన్ వాయిదా!!
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నిఖిల్ ప్రస్తుతం పెళ్లి కంటే సినిమా మూడ్‌లోనే ఉన్నట్లున్నాడు. `అర్జున్ సురవరం` సక్సెస్ తర్వాత నిఖిల్ `కార్తికేయ2` సినిమా షూటింగ్‌ను తిరుపతిలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమించిన అమ్మాయి పల్లవి శర్మను ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నాడు. మరి పెళ్లికి, హానీమూన్‌కి ఎన్నిరోజులు సెలవు తీసుకుంటున్నావని నిఖిల్‌ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే తను మాట్లాడుతూ ‘‘వీకాఫ్ తీసుకుని పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లికి ప్రత్యేకంగా సిద్ధం కావడానికి సమయం లేదు. పెళ్లి ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయి. కానీ నేను ప్రస్తుతం సినిమాపైనే ఫోకస్ పెట్టాను. అందుకనే హానీమూన్ని వాయిదా వేసుకున్నాను’’ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ‘‘సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకున్నాం. కాబట్టి కాలంతో వేగంగా పరిగెత్తుతున్నాం. స్వాతి కార్తికేయలో నటించిన పాత్రలోనే నటిస్తున్నారు. ఆమెతో పాటు మరో హీరోయిన్ని కూడా తీసుకున్నాం. ఆరు నెలలు పాటు ప్రీ ప్రొడక్షన్‌పై స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం. పలు ఆలయాలను సందర్శించడమే కాదు. వేదాల గురించి కూడా తెలుసుకున్నాం. కార్తికేయ వచ్చి ఆరేళ్లు అవుతుంది. దానికి సీక్వెల్‌గా కార్తికేయ2 ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నప్పటికీ ప్రేక్షకులు ఫ్రెష్‌గా ఫీల్ అవుతుండటం సంతోషంగా అనిపిస్తుంది’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments