ప్యాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్న నిఖిల్
- IndiaGlitz, [Sunday,April 12 2020]
యువ కథానాయకుడు నిఖిల్ గత ఏడాది ‘అర్జున సురవరం’తో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ‘18 పేజీస్’ కాగా.. మరో చిత్రం ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ 2’. ‘కార్తికేయ 2’ కోసం నిఖిల్ 6 ప్యాక్ చేస్తుండటం విశేషం. మరో నాలుగు వారాల్లో పూర్తిస్థాయి సిక్స్ ప్యాక్‌తో నిఖిల్ ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. కాగా ఈ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు నిఖిల్.
ఇతర భాషల్లో నటించే అవకాశం ఉందా? అని అడిగితే.. అలాంటి ఆలోచన లేదని చెప్పిన నిఖిల్ కార్తికేయ 2 చిత్రాన్ని నాలుగైదు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ అన్నీ భాషల్లో డబ్బింగ్ చెప్పుకున్నట్లు తాను కూడా అన్నీ భాషల్లో డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాడట నిఖిల్. అందుకు కారణం ‘కార్తికేయ 2’ యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందుతుందట. అంటే ‘కార్తికేయ 2’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించి తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువదించి విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తుంది. అంటే కార్తికేయ 2 పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుందన్నమాట.