నిఖిల్ సరసన హెగ్డే
Send us your feedback to audioarticles@vaarta.com
నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ హీరోయిన్‌గా హెగ్డే ఎంపికైంది. హెగ్డే అనగానే పూజా హెగ్డే అనుకునేరు. కాదండీ సమ్యక హెగ్డే. కన్నడలో హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాలో నిఖిల్ సరసన నటించడానికి ఈ భామ ఎంపికైంది.
14 రీల్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం నిఖిల్ బాడీ బిల్డప్ చేసి, గడ్డం పెంచి రగ్డ్ లుక్‌కి ట్రై చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలుండగా ఒక నాయిక ఎంపిక జరిగింది. మరో నాయిక కోసం అన్వేషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కిస్తున్నారు. మరో రెండేళ్ల పాటు సినిమాలతోనే ప్రేమలో ఉంటానని, ప్రస్తుతం పెళ్లి మీద తనకు ఆసక్తి లేదని నిఖిల్ చెప్పిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com