నిఖిల్ కొత్త చిత్రం టైటిల్ అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
కార్తికేయ`, ఎక్కడికి పోతావు చిన్నవాడా`, సూర్య వర్సెస్ సూర్య`.. ఇలా విభిన్నమైన కథలతో సినిమాలను చేసి విజయాలను సొంతం చేసుకున్నారు యువ కథానాయకుడు నిఖిల్. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న కిరాక్ పార్టీ` సినిమాలో నిఖిల్ స్టూడెంట్ లీడర్‌గా నటించారు. ఇది కన్నడ సినిమా కిరిక్ పార్టీ`కి రీమేక్. ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా వుంటే.. 2016లో తమిళంలో ఘన విజయం సాధించిన కణితన్` సినిమాని తెలుగులో పునఃనిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా హక్కుల్ని ఠాగూర్` మధు సొంతం చేసుకున్నారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ముద్ర` అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించారని సమాచారం. తమిళ్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్.. తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్వ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి కథానాయిక వివరాలతో పాటు మరిన్ని విషయాలను నిర్మాత త్వరలోనే వెల్లడిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com