నిఖిల్ నూతన చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
న్యూ జనరేషన్‌కు నచ్చే సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య` వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకొని.. యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకొన్న నిఖిల్ సిద్దార్థ్.. "శంకరాభరణం" అనంతరం నటించే చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వర్రావు తన మొదటి చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి.. టైగర్` చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తన ప్రతిభను ఘనంగా చాటుకున్న యువ ప్రతిభాశాలి "వి.ఐ.ఆనంద్" దర్శకత్వం వహిస్తున్నారు.
విజయదశమి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంబమైన ఈ చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ చిత్రం టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నారు
చిత్ర నిర్మాత-మేఘన ఆర్ట్స్ అధినేత పి.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. "టైగర్" చిత్రంతో విజయం సాధించి, స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనాన్ని ఆవిష్కరించిన వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తనదైన శైలిలో సరికొత్త కధలని ఎంచుకునే హీరో నిఖిల్ ఈ కధని సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకె చేసారు. సాయిశ్రీరాం, అబ్బూరి రవి, శేఖర్‌చంద్ర, చోటా కే ప్రసాద్ వంటి సక్సెస్ ఫుల్ టేక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల ఎంపిక పూర్తి చేసి.. నవంబర్ చివరిలో సెట్స్ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం " అన్నారు.
ఈ చిత్రానికి ఛీఫ్ అసోసియేట్ డైరెక్టర్: విజయ్ కామిశెట్టి, కో-డైరెక్టర్: వరప్రసాద్ వరికూటి, ఆర్ట్: ఎ.రామాంజనేయులు, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: సాయిశ్రీరాం, సహ నిర్మాత: డి.శ్రీనివాస్, నిర్మాత: పి.వెంకటేశ్వర్రావు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com