సెకండ్ షెడ్యూల్ లో నిఖిల్ 'ముద్ర'

  • IndiaGlitz, [Monday,July 16 2018]

నిఖిల్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ముద్ర' టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటిసారి నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో నిఖిల్, లావణ్య త్రిపాఠిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఒక టీవీ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

సినిమాలో కొన్ని సీన్స్ వాస్తవానికి దగ్గరగా ఉండడంతో ఒరిజినల్ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు.

నిఖిల్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన ముద్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. విభిన్న పాత్రల్లో కనిపించే నిఖిల్ ఈ సినిమాలో రిపోర్టర్ రోల్ లో నటించారు. సామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ముద్ర సినిమాను అవురా సినిమాస్ ప్రవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి.మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.