నిఖిల్ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్...
Send us your feedback to audioarticles@vaarta.com
నిఖిల్ హీరోగా వచ్చిన స్వామిరారా తనకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం విడుదలై మూడేళ్లు అవుతుంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా దర్శకుడు సుధీర్‌వర్మతో నిఖిల్ మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందనుందట. ఫైట్స్ చాలా రియలిస్టిక్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఈ చిత్రానికి, బాలీవుడ్ చిత్రం గ్యాంగ్ ఆఫ్ వసియాపూర్ మ్యూజిక్ డైరెక్టర్ స్నేహ ఖాన్ వాకర్ సంగీతం అందించనున్నారని హీరో నిఖిల్ తెలియజేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈచిత్రంలో వీలైనంత కొత్తదనం కోసమే కొత్త టెక్నిషియన్స్‌ను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా నిఖిల్ ఈ సందర్భంగా తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments